వరంగల్ ట్రాఫిక్ కష్టాలకు చెక్!
వరంగల్ ట్రాఫిక్ కష్టాలకు చెక్! రంగంలోకి దిగిన సీపీ శ్వేత జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌తో కీలక సమీక్ష 159 చీకటి ప్రాంతాల గుర్తింపు బ్లాక్‌స్పాట్లు, సిగ్నళ్లపై ప్రత్యేక దృష్టి కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ట్రైసిటీలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత చర్యలకు శ్రీకారం చుట్టారు. గురువారం పోలీస్ కమిషనరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ భరద్వాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్‌స్పాట్ల వివరాలను...