బాలికల హాస్టల్ నుంచి దుర్గంధం
బాలికల హాస్టల్ నుంచి దుర్గంధం పట్టించుకోని వార్డెన్, అధికారులపై స్థానికుల ఆవేదన కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ఏటూరునాగారం మండల కేంద్రంలోని తాళ్లగడ్డ ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికుడు కందకట్ల సతీష్ ఆరోపించారు. పాఠశాల ప్రాంగణంలోని పైపులు పగిలిపోవడంతో పాటు గోడ కూలిపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధం ఇళ్లలోకి వస్తోందన్నారు. గోడ కూలి చాలాకాలమైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ లింగయ్యకు పలుమార్లు తెలిపినా స్పందించలేదన్నారు. ఐటీడీఏ ఇంజనీరింగ్,...