ప్రజలకు చేరువయ్యేలా విధులు నిర్వహించాలి

ప్రజలకు చేరువయ్యేలా విధులు నిర్వహించాలి పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలి దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ఎస్పీ మహేష్‌ బి. గితే కాకతీయ, గంభీరావుపేట: విధుల నిర్వహణ, పనితీరు మెరుగుపర్చడం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్‌ బి. గితే సూచించారు. శనివారం గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన కేసులు, పెండింగ్‌ దర్యాప్తులు, రికార్డులు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. కేసుల దర్యాప్తులో శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి,...