కొండా ఫ్యామిలీకి రేవూరిని విమర్శించే హక్కులేదు

కొండా ఫ్యామిలీకి రేవూరిని విమర్శించే హక్కులేదు సుస్మిత వ్యాఖ్యలను ఖండించిన గీసుగొండ మండ‌ల అధ్య‌క్షుడు శివ‌ కాకతీయ, గీసుగొండ : పరకాల నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిన కొండా సుస్మితకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దాడి శివ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం గీసుగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం, ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిని చూసి...