ప్రేరణ కార్యక్రమంలో ప్రతిభకు గుర్తింపు
ప్రేరణ కార్యక్రమంలో ప్రతిభకు గుర్తింపు ప్రధానమంత్రి ప్రశంసలు పొందిన విద్యార్థి దీక్షిత్ విద్యార్థిని సత్కరించిన పాఠశాల యాజమాన్యం కాకతీయ, నెల్లికుదురు : ప్రేరణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసాపత్రం అందుకున్న సింగారం దీక్షిత్‌ను ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్‌రావు శనివారం సత్కరించారు. పదో తరగతి చదువుతున్న దీక్షిత్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని వివిధ పోటీల్లో ప్రతిభ చాటినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులతో కలిసి విలువైన అనుభవాలు పొందాడన్నారు. ప్రధాని ప్రశంసలు అందుకోవడం...