శ్రీభద్రకాళి అమ్మవారికి సారే సమర్పించిన ఆడపడుచులు
శ్రీభద్రకాళి అమ్మవారికి సారే సమర్పించిన ఆడపడుచులు శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు కాకతీయ, వరంగల్ : శ్రావణమాసం సందర్భంగా వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీభద్రకాళి దేవాలయంలో మంగళవారం అమ్మవారికి సారే సమర్పించారు. రంగసాయిపేటకు చెందిన శంకేసి రమాదేవి ఆధ్వర్యంలోని మహిళల బృందం తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళలు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పిండి వంటకాలను ఆలయానికి తీసుకువచ్చి ప్రధాన పూజారి భద్రకాళి శేషు సమక్షంలో వేదమంత్రాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఇటికాల...