పీఎం శ్రీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పీఎం శ్రీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బోధనతోపాటు క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కాకతీయ, జనగామ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. గురువారం పాలకుర్తి మండలంలోని పీఎం శ్రీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటశాల, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. హిందీ, ఇంగ్లిష్, గణితం, సాంఘికశాస్త్రంలో వారి అభ్యాస సామర్థ్యాన్ని పరీక్షించారు....