ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!
ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు మట్టి కేటాయించాలని వినతి త్వరలో రక్షణ చర్యలు చేపడతాం : అటవీ శాఖ అధికారి భూలక్ష్మి కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తండాలోని ఎల్లయ్యకుంట చెరువు ప్రమాదకర స్థితికి చేరుకుంది. చెరువుకు గండి పడటంతో ఎప్పుడు తెగిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉండటంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరారు....