మేడారంలో ఇసుక దోపిడి!

మేడారంలో ఇసుక దోపిడి! జంపన్నవాగులో యథేచ్ఛగా తవ్వకాలు.. టిప్పర్లతో భారీగా రవాణా..... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమ తవ్వకాలు? కన్నెత్తి చూడని అధికారులు.. ప్రజాప్రతినిధుల పాత్రపై అనుమానాలు..... కాకతీయ ములుగు ప్రతినిధి: సమ్మక్క-సారలమ్మ వనదేవతల జాతరతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం ఇప్పుడు ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలతో వార్తల్లోకి ఎక్కుతోంది. జాతర ముగిసిన అనంతరం జనసంచారం తగ్గడాన్ని ఆసరాగా చేసుకున్న ఇసుక అక్రమ రవాణాదారులు జంపన్నవాగును టార్గెట్‌గా చేసుకుని భారీగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా...