కష్టకాలంలో కాంగ్రెస్ అండగా ఉంటుంది
కష్టకాలంలో కాంగ్రెస్ అండగా ఉంటుంది శాంతమ్మ కుటుంబానికి నేతల పరామర్శ రాయపర్తి సర్పంచ్ గారె సహేంద్ర భిక్షపతి కాకతీయ, రాయపర్తి : శాంతమ్మ మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, కష్టకాలంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాయపర్తి సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మండల కేంద్రానికి చెందిన పరకాల శాంతమ్మ సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు....