వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త అధికారుల నియామకం పోస్టింగ్‌ల కోసం ఎమ్మెల్యేల సిఫారసులు ఎవరి ఫైరవీ ఫలించింది..? అంటూ పోలీస్‌ వర్గాల్లో చర్చ కాకతీయ, వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా 22 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో తక్షణ ప్రభావంతో బదిలీలు చేపట్టినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా పోస్టింగ్‌ పొందిన అధికారులు...