మూడు దశాబ్దాల తర్వాత… మళ్లీ ఒక్కచోట!

మూడు దశాబ్దాల తర్వాత... మళ్లీ ఒక్కచోట! సీకేఎం స్నేహబంధానికి చిరునామాగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం యూకే నుంచి స్నేహం కోసం వచ్చిన సాంబమూర్తి కాకతీయ, హన్మ‌కొండ : మూడు దశాబ్దాల కాలం.. మారిన జీవితాలు.. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులు.. అయినా చెక్కుచెదరని స్నేహబంధం. వరంగల్‌లోని ప్రముఖ సీకేఎం డిగ్రీ కళాశాలలో 1996లో బీఎస్సీ మ్యాథ్స్‌ చదువుకున్న పూర్వ విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత హనుమకొండలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో సమ్మేళనం ఆద్యంతం సందడిగా, ఆప్యాయంగా సాగింది. చాలా...