420 హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులా?

420 హామీలపై ప్రశ్నిస్తే అరెస్టులా? ప్రజా ఉద్యమాలను అరెస్టులతో అడ్డుకోలేరు వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లోకి వెళ్తాం హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ కాకతీయ, హన్మ‌కొండ‌ : ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తరఫున నిరసన చేపడుతుంటే పోలీసులతో అడ్డుకోవడం సరికాదన్నారు. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని స్పష్టం...