రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా!

రికార్డుల్లో ఒకలా.. మోకాపై మరోలా! వ్యవసాయ భూమిగా పట్టా.. మోకాపై వ్యవసాయేతర వినియోగం లేఅవుట్‌ చేసి 50–60 మందికి ప్లాట్ల విక్రయం? కోర్టు వివాదం నడుస్తుండగానే మట్టి డంపింగ్‌.. రైతుబంధుపైనా సందేహాలు అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు.. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్ కాకతీయ, గీసుగొండ : రికార్డుల్లో వ్యవసాయ భూమిగా నమోదై ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 160పై చర్చకు దారితీశాయి. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 2.10...