నల్లచొక్కాలతో నిరసన చేస్తే పోలీసుల దాడులా?

నల్లచొక్కాలతో నిరసన చేస్తే పోలీసుల దాడులా? మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో వ్యవహరించిన తీరు నీచం పోలీసులను అడ్డుపెట్టుకొని రాక్షస పాలన సాగిస్తున్నారు 1000 రోజుల కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు ఒరిగిందేమీ లేదు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, పాలకుర్తి : నల్లచొక్కాలతో నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తెలంగాణ అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేయడం అమానుషమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆనాడు పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ నల్లచొక్కాలతో నిరసనకు వెళ్లినప్పుడు ఇదే నిబంధనలు, ఇదే తెలివి ఎక్కడికి పోయిందని...