144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ
144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు : గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. జంగాల రాజేశ్వరరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిరాం హాస్పిటల్స్ సహకారంతో గురువారం నిర్వహించిన శిబిరాన్ని సర్పంచ్ మాదరి ప్రశాంత్, ఉపసర్పంచ్ రామగిరి సుమన్ తదితరులతో కలిసి ప్రారంభించారు. శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని, వివిధ వ్యాధులకు సంబంధించి 144 మందికి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన...