బీఆర్‌ఎస్.. బీజేపీ బాటలోనే
బీఆర్‌ఎస్.. బీజేపీ బాటలోనే కేసీఆర్ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి రాకుండా బీఆర్‌ఎస్ రచ్చ హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి కాకతీయ,హన్మకొండ : బీఆర్‌ఎస్ బీజేపీని అనుసరిస్తోందని, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహరించడం క్షమించరాని నేరమని కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అన్నారు. దళితులపై వివక్షకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల...