ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?
ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్ కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ అధికారులు రూ.5 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో చేపట్టిన మూత్రశాలల నిర్మాణం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు,వృద్ధులు తక్షణమే నిర్మాణం పూర్తి చేయాలని ప్రజల డిమాండ్ కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సుమారు బస్టాండ్ ప్రారంభమై 6 సంవత్సరాల 9 నెలలు పూర్తవుతున్నప్పటికీ,నేటికీ ప్రయాణికుల కోసం మూత్రశాలలు నిర్మించకపోవడం శోచనీయం.నిత్యం వందలాదిమంది ప్రయాణికులు,విద్యార్థులు,ఉద్యోగులు, వరంగల్,ఖమ్మం,తొర్రూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు...