సీసీగా ఇషాక్.. పీఆర్వోగా తిరుపతి
సీసీగా ఇషాక్.. పీఆర్వోగా తిరుపతి వేణుగోపాల్‌రావు, మోహనకృష్ణ బదిలీ కాకతీయ, హన్మకొండ: వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో క్యాంపు క్లర్క్ (సీసీ) వేణుగోపాల్‌రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహనకృష్ణ బదిలీ అయ్యారు. వారి స్థానాల్లో స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఏవో ఇషాక్‌ను సీసీగా, సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిని పీఆర్వోగా నియమించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.