ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం
ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న గ్రంథాలయం ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం గ్రంథాలయం పరిసరాల్లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏటూరునాగారం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ, గుర్తింపు ఇంకా తెలియరాలేదు. మృతుడి వివరాలను...