కార్యాలయాలకే పరిమితం కావొద్దు
కార్యాలయాలకే పరిమితం కావొద్దు ప్రజల్లోకి వెళ్లి సమస్యలను పరిష్కరించాలి గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశం కాకతీయ, రాయపర్తి/పాలకుర్తి: అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాయపర్తి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, వ్యవసాయం, సాగునీరు, పింఛన్లు, రేషన్...