కాకతీయ ఎఫెక్ట్..
కాకతీయ ఎఫెక్ట్.. వాడుకలోకి వైకుంఠ రథం వార్తా కథనానికి అధికారుల తక్షణ స్పందన కాకతీయ, రాయపర్తి: ‘కాకతీయ’ కథనానికి అధికారులు స్పందించారు. గత కొంతకాలంగా మూలనపడి నిరుపయోగంగా ఉన్న వైకుంఠ రథానికి మరమ్మతులు పూర్తి చేసి వాడుకలోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 1న ‘ఉత్తరం కాకతీయ’ దినపత్రికలో ‘మూలనపడి మూలుగుతున్న వైకుంఠ రథం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక సర్పంచ్ గారె సహేంద్ర బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి గుగులోత్ యాకుబ్ నాయక్ వాహనంలోని సాంకేతిక లోపాలను సరిచేయించారు. వైకుంఠ రథం అందుబాటులో లేక...