ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి
ఉద్యమకారుల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ కాకతీయ, హనుమకొండ: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, హక్కుల సాధన కోసం నిర్వహించనున్న ఓదార్పు యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ నేతృత్వంలో చేపట్టనున్న యాత్ర పోస్టర్‌ను మంగళవారం ఎర్రగట్టుగుట్ట సర్కిల్‌లో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జీల సమక్షంలో హసన్‌పర్తి మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మేకల కన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా సౌరం రవీందర్,...