గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

గోవిందరాజుల స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కాకతీయ,చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామివారిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తన జన్మదిన సందర్భంగా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది శ్రీనివాస్‌కు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు.