వాలీబాల్ పోటీల్లో రన్నరప్‌గా శంకరపట్నం జట్టు
వాలీబాల్ పోటీల్లో రన్నరప్‌గా శంకరపట్నం జట్టు జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుకున్న క్రీడాకారిణులు కాకతీయ,శంకరపట్నం:అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ అండర్–14 బాలికల కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో శంకరపట్నం మండల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. పోటీల అనంతరం హెచ్‌డీఎఫ్ సెక్రటరీ బన్సీలాల్ చేతుల మీదుగా క్రీడాకారిణులు బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా శంకరపట్నం ఎంఈఓ ఎం. లక్ష్మీనారాయణ, ఏజ్‌యాప్ మండల సెక్రటరీ ఆడెపు శ్రీనివాస్, జడ్పీహెచ్‌ఎస్ కేశవపట్నం హెచ్‌ఎం సుభాష్, కేశవపట్నం సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ క్రీడాకారిణులను అభినందించారు....