లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి గూడెప్పాడు శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం లారీ వెనుక ఢీకొని అక్కడికక్కడే మృతి కాకతీయ, ఆత్మకూరు: లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో శనివారం వ్యక్తి మృతి చెందిన ఘటన ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఆత్మకూరు సీఐ బాబులాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్‌ గ్రామానికి చెందిన కనకం శరత్‌కుమార్‌ (28) పాల బండి నడుపుతూ పరకాలలో పాలు పోసి తిరిగి వస్తున్నాడు. గూడెప్పాడు శివారులో జాతీయ రహదారి 163పై లారీని డ్రైవర్‌ అజాగ్రత్తగా నిలిపివేయడంతో,...