రహుమునిషా బేగంకు పరామర్శ
రహుమునిషా బేగంకు పరామర్శ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహుమునిషా బేగం అనారోగ్యంతో హనుమకొండలోని ఏకశిల (మ్యాక్స్‌కేర్) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ శనివారం ఆసుపత్రికి వెళ్లి రహుమునిషా బేగంను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రహుమునిషా బేగంకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.