19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన కాకతీయ, కూకట్‌పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ ఆదిత్యనగర్‌ పార్కు వద్ద వుయ్యూరు జగదీష్‌ ఆధ్వర్యంలో అఖండ అన్నసమారాధన నిర్వహించారు. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన జగదీష్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే అన్నసమారాధనను ఈసారి 19 రకాల ఆంధ్రా గోదావరి రుచులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. నూజివీడుకు చెందిన ప్రముఖ వంటమేస్త్రీ పుల్లయ్య బృందం ఆధ్వర్యంలో వంటలు తయారు చేసి 1500 మందికి పైగా భక్తులకు బంతిభోజనం పెట్టారు. చాలా రోజుల తర్వాత 19 రకాల...