వినాయక నిమజ్జనానికి పటిష్ఠ విద్యుత్ ఏర్పాట్లు
వినాయక నిమజ్జనానికి పటిష్ఠ విద్యుత్ ఏర్పాట్లు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి కాకతీయ, హన్మకొండ: వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కాజీపేటలోని బంధం చెరువు, హన్మకొండ సిద్ధేశ్వర గుండం నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాలు, గణేష్ మండపాల వద్ద విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టే వైర్లు, సర్వీస్ వైర్లను తనిఖీ చేసి ప్రమాదకర ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక విద్యుత్ సదుపాయాల్లో...