గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక
గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక 375 రకాల పనుల్లో ప్రాధాన్య పనుల గుర్తింపు ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఆత్మకూర్ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి కాకతీయ, ఆత్మకూర్ : గ్రామంలోని వాస్తవ అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడమే వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ లక్ష్యమని ఆత్మకూర్ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పెద్దాపూర్ గ్రామపంచాయతీలో వీబీజీ–రామ్‌జీ ప్లాన్ తయారీ విధానంపై శనివారం రైతువేదికలో గ్రామసభ నిర్వహించి డెమో చేపట్టారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌లను రూపొందించారు. రహదారులు,...