రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం ప్రాణదానంతో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని బాధ్యతగా భావించాలి బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ కాకతీయ, హనుమకొండ : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక బాధ్యతగా భావించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. హనుమకొండలోని పోచమ్మకుంటలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని, రక్తదాతల ద్వారా మాత్రమే సేకరించి...