నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ ఉద్యోగులు కాకతీయ, నిజామాబాద్ : రూ.15 వేల లంచం తీసుకుంటూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జూనియర్ అసిస్టెంట్ పాల్దా అశోక్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కలకుంట్ల కిరణ్‌కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిజామాబాద్‌లోని పద్మశాలి సంఘం వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఇద్దరినీ అరెస్ట్ చేసిన అధికారులు తదుపరి చర్యల్లో భాగంగా హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు.లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు...