రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..!

రుద్రంగిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..! కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ, రేగుల మల్లవ్వలకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ గండి నారాయణ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు. ఇళ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు....