ప్రమాదాలకు తావివ్వొద్దు.

ప్రమాదాలకు తావివ్వొద్దు. నిమజ్జన వేళ అప్రమత్తత అవసరం  వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య  కాకతీయ, రాయపర్తి: వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని చెరువులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. చీకటి పడకముందే నిమజ్జనం పూర్తి చేయాలని, ఘాట్ల వద్ద భద్రత, లైటింగ్‌, రోడ్ల మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. శోభాయాత్రలో డీజే సౌండ్‌ సిస్టమ్‌లకు అనుమతి లేదని...