కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌ 

కార్తీక్‌ అకాల మృతి బాధాకరం : ఎమ్మెల్యే మురళి నాయక్‌  కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన మద్దెల కార్తీక్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌ శ్రీరామగిరికి చేరుకుని కార్తీక్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్‌ మాట్లాడుతూ కార్తీక్‌ అకాల మృతి కలచివేసిందన్నారు. కుటుంబాన్ని చూసుకోవాల్సిన కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడం బాధాకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కుటుంబానికి అండగా...