సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కాకతీయ, పెద్దవంగర : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దవంగర ఎంపీడీవో రామ్మోహన్ తెలిపారు. సోమవారం పెద్దవంగర రైతు వేదికలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు.ప్రజల నుంచి అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.