నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్తవం
నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్తవం బడి తండా సర్పంచి ధనమ్మ అమ్రూ నాయక్ కాకతీయ,నెల్లికుదురు : నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని నెల్లికుదురు మండలం బడి తండా సర్పంచి బిలావత్ ధనమ్మ అమృ నాయక్, ఉపసర్పంచి గుగులోతు చిట్టెమ్మ అన్నమయ్య తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము బడి తండ, శివారు చండాలలో చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వ లేక సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేగడి తండా పిఆర్ రోడ్డు నుంచి రాజేందర్ ఇంటి వరకు 25 ఫీట్ల వెడల్పు...