నయీం ఆస్తుల లెక్క తారుమారు..!
నయీం ఆస్తుల లెక్క తారుమారు..! 327 ఆస్తులపై జీవో.. గెజిట్ జారీ తూప్రాన్‌పేటలోనే ఎందుకీ గందరగోళం? 22ఏ జాబితాలో కనిపించని భూములు 5.5 ఎకరాలు అప్‌లోడ్.. 40 ఎకరాల సంగతేంటి? రిజిస్ట్రేషన్ యత్నంతో బయటపడిన వ్యవహారం నయీం ఆస్తులు చేతులు మారుతున్నాయా? కాకతీయ, తెలంగాణ బ్యూరో : గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల లెక్కలు మాయమవుతున్నాయా? ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చాలని స్పష్టంగా ఆదేశించిన ఆస్తుల్లోనే కొన్ని వివరాలు రికార్డుల్లో కనిపించకపోవడం వెనుక ఏముంది? నయీంకు చెందిన 327 ఆస్తులను 22ఏ(1)(ఈ) కింద చేర్చాలని జీవో...