చెరువు మ‌త్త‌డితో గ్రామస్థుల సంబ‌రాలు

చెరువు మ‌త్త‌డితో గ్రామస్థుల సంబ‌రాలు కాకతీయ, చిగురుమామిడి: సుందరగిరి గ్రామంలోని ఊర చెరువు మత్తడి పడి పొంగిపొర్లుతుండటంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్‌ జంగ శిరీష రమణారెడ్డి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో గ్రామంలో తాగునీటికి, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా వర్ధిల్లాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. చెరువు నిండటంతో...