భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలి : బల్దియా కమిషనర్ టి వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి వెంకన్న ఆదేశించారు. గురువారం ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, డీఆర్ఎఫ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రెస్క్యూ బృందాలు, జేసీబీలు, డీవాటరింగ్ మోటార్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు....