అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక
అమెరికా వాయేజర్ స్కాలర్‌షిప్‌కు రిత్విక్ కొర్రపాటి ఎంపిక రిత్విక్ కేఆర్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ సుధాకర్ వారసుడే అమెరికా వ్యాప్తంగా 100 మందికే అవకాశం మండలంలో పలువురు హర్షం కాకతీయ ప్రతినిధి, ఏలూరు : అమెరికాలోని ప్రతిష్టాత్మక ది ఒబామా చెస్కీ వాయేజర్ స్కాలర్‌షిప్ ఫర్ పబ్లిక్ సర్వీస్‌కు మండలంలోని తడికలపూడిలోని కేకేఆర్ బ్రైట్‌మైండ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ కొర్రపాటి సుధాకర్, డాక్టర్ గీత దంపతుల రెండో కుమారుడు కొర్రపాటి రిత్విక్ ఎంపికయ్యారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ బహుమతి విజేత బరాక్ ఒబామా, మిషెల్...