ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం

ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలి సోషల్‌ మీడియాను విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధికి వినియోగించాలి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ కాక‌తీయ‌, నిజామాబాద్ : పట్టణంలో నిర్మించనున్న నూతన గ్రంథాలయాన్ని ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా అభివృద్ధి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలు, నాణ్యమైన పుస్తకాలు, డిజిటల్‌ వనరులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పుస్తక పఠనం ప్రతి...