చందుర్తిలో బెల్ట్‌ దందా జోరు

చందుర్తిలో బెల్ట్‌ దందా జోరు ఎక్సైజ్‌ ఉక్కుపాదం ఎక్కడ? దాడులు చేస్తున్నా.. అక్రమ మద్యం ఆగేదెప్పుడు? బంద్‌ వేళ అడ్డగోలు ధరలతో అమ్మకాలా? సరఫరా మూలాలపై ఎక్సైజ్‌ నజర్‌ ఎక్కడ? కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో బెల్ట్‌ షాపుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో యథేచ్ఛగా అక్రమ మద్యం విక్రయాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో వీధికో బెల్ట్‌ షాప్‌ ఉన్నట్లు స్థానికులు చెబుతుండగా.. కిరాణా దుకాణాలు, చికెన్‌ సెంటర్లలోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు...