లింగంపేటలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

లింగంపేటలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ శుక్రవారం అందజేశారు. కముటం లక్ష్మిరాజంకు రూ.32,000, మారుపాక వెంకటేష్‌కు రూ.27,500, మారుపాక దేవవ్వకు రూ.17,500, పురుగుల సంధ్యకు రూ.60,000 చొప్పున మొత్తం రూ.1.37 లక్షల విలువైన చెక్కులను అందించారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు ఇందూరి రాజు, కాంగ్రెస్‌ నాయకులు తర్రె గణేష్‌, ఆనంద్‌, గుడిసె గణేష్‌, లబ్ధిదారులు పాల్గొన్నారు.