గణనాథుడికి ఘన వీడ్కోలు

గణనాథుడికి ఘన వీడ్కోలు క‌రీంన‌గ‌ర్ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా నిమజ్జన కార్యక్రమం కాక‌తీయ‌, కరీంనగర్ : పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం, ఐపీఎస్‌ ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్ల నడుమ భక్తిశ్రద్ధలతో గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ వెంకటరమణతో పాటు కమిషనరేట్‌ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.