ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘన నివాళి
ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘన నివాళి కాకతీయ, హైదరాబాద్ : దివంగత ఇనగాల అమరేందర్‌రెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి తండ్రి అమరేందర్‌రెడ్డి 2002లో మృతి చెందారు. వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమరేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఆయన సేవలను స్మరించుకున్నారు.