ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం కాకతీయ, శంకరపట్నం : తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన చిట్యాల ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఐలమ్మ 131వ జయంతిని పురస్కరించుకుని శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి తహసీల్దార్‌ సురేఖ, ఎంపీడీవో అనిత, ఎస్సై కట్కూరి శేఖర్‌రెడ్డి, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ జీవితాన్ని, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల...