శ్మశాన వాటికకు దారేది?
శ్మశాన వాటికకు దారేది? కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామంలో స్మశానవాటికకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో దారి బురదమయంగా మారడంతో మృతదేహాలను స్మశానవాటికకు తరలించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని ఇతర అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులు స్మశానవాటిక రహదారి సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశానవాటికకు శాశ్వత రహదారి నిర్మించాలని కోరుతున్నారు.