ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి
ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాకతీయ, హైదరాబాద్ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ నిప్పుకణికలా పోరాడిన ఐలమ్మ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచారని...