అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల!
అంబేడ్కర్‌పై వ్యాఖ్యలు.. చందుర్తిలో దళితుల ఆగ్రహజ్వాల! రామస్వామిపై అట్రాసిటీ కేసు.. తక్షణ అరెస్టుకు డిమాండ్ రోడ్డుపై బైఠాయింపు.. పోలీస్ స్టేషన్ వరకు ఆందోళన 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే సీఎం సభను అడ్డుకుంటాం! కాకతీయ,చందుర్తి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దళిత సంఘాలు తీవ్ర నిరసనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి...